అమరావతి : గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాదు రాజ్ భవన్ కు వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు కొంత మంది శాసన సభ్యులు వెళ్లారు. బేగంపేట నుండి నేరుగా జగన్ బృందం రాజ్ భవన్ కి వెళ్ళి శాసన సభ పక్ష తీర్మానాన్ని గవర్నర్ కి అందజేశారు. అక్కడ నుండి సాయంత్రం 5.30 ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఅర్ తో భేటీ అయ్యారు.
ఆదివారం ఉదయం 12.30ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ ఖరారు కావడంతో జగన్మోహన్ రెడ్డి కడప పర్యటన రద్దు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు సియస్ యల్వి సుబ్రమణ్యం, మరికొంత మంది అధికారులు ఉన్నారు.