Home ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

493
0

అమరావతి : వైసీపీ అధినేత జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన అనంతరం జగన్‌, కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో మద్దతిచ్చిన కేసీఆర్‌ను కలసి జగన్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

30న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు. ఈ నెల 26న జగన్ హస్తినకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్‌ను మోదీ ఇప్పటికే అభినందించారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ జగన్ మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.