Home ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరిన జగన్

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరిన జగన్

290
0

హైదరాబాదు : బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభిమానులు భారీ స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా రాజ్ భవన్ కి వెళ్ళి గవర్నర్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ ముందు జగన్ అభిమానులు హడావిడి చేశారు. సీని నటుడు విజయ్ చందర్ ఉన్నారు.

బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక వాహన శ్రేణి ద్వారా రాజ్ భవన్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. శాసన సభా పక్ష తీర్మానాన్ని గవర్నర్ నరశిహన్ కి అందించారు. ప్రభుత్వ ఎర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరారు. జగన్మోహన్ రెడ్డి వెంట విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు.