– అర్హులైన దివ్యాంగులందరికి ఫించన్లు
– చీరాలలో దివ్యంగుల కాలనీ ఏర్పాటు
– కార్పొరేషన్ ద్వార సులబంగా రుణాలు
– వైసిపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ నాయిడు
– దివ్యాంగులకు అందుబాటులో శ్రీకామాక్షి హాస్పిటల్ : కామాక్షి అధినేత తాడివలస దేవరాజు
చీరాల : దివ్యాంగుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని వైసిపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అవినాష్ పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా రోటరీ కమ్మునిటి హాల్ వద్ద అఖిల భారత దివ్యాంగుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అవినాష్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు అందేలా తాను కృషి చేస్తానన్నారు. అదేవిధంగా చీరాల్లో దివ్యాంగులకు ప్రత్యెక కాలని నిర్మించటానికి సహకారం అందజేస్తానన్నారు. కార్పొరేషన్ ద్వార సులభంగా రుణాలు మంజూరయ్యేలా చూస్తామన్నారు. దివ్యాంగుల ఫించన్లు పెంచటానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడించారు. మీరందరూ సమిష్టిగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఉద్యోగాల భర్తీ, ఇతర సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా వివాహం చేసుకొనే వారికీ తన వంతుగా మంగళ సూత్రాలు అంధజేస్తానని చెప్పారు.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ దివ్యాంగులకు ఎటువంటి సమస్య వచ్చిన తమ వైద్యశాల ఎల్లపుడు అండగా ఉంటుందని అన్నారు. వీరు అత్యంత ప్రతిభావంతులని, ఏ పని అయిన ఓర్పు, నేర్పుతో సమర్ధవంతంగా చేయగలరని కొనియాడారు. వారికీ ప్రభుత్వం పరంగా తగిన ప్రోత్సాహం అందిస్తే మరింతగా రాణిస్తారని తెలిపారు. అందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పధకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజం వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సమస్యలను ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సమస్యలపై పోరాడుతున్న నాయకులను అభినందించారు. ప్రేమ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఐ బాబురావు మాట్లాడుతూ దివ్యాంగులకు తన వంతు సహాయం చేస్తానన్నారు. అనంతరం దుప్పట్లు పంపిణి చేసారు. అంతకు ముందు దివ్యాంగులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పెతురుబాబు, సురేష్, అంకయ్య, ఒభులేసు, దత్తత్రేయ, సునీత, నాగేశ్వరరావు, ప్రవీణ్, సుధాకర్ పాల్గొన్నారు.