చీరాల: జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్ నందు, శ్రీ కామాక్షి కేర్ ఆస్పటల్ ఆవరణలో చీరాల జిల్లా కోరుతూ సంతకాల సేకరణ చేశారు. చీరాల జిల్లాకు మద్దతుగా కోర్టు వద్ద న్యాయవాదులు సంతకాలు చేశారు.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ కి వచ్చినటువంటి పేషెంట్ సహాయకులు వద్ద జిల్లా ఏర్పాటు కోరుతూ సంతకాల సేకరించారు. ఉద్యమానికి మద్దతుగా సందరు సంతకాలు చేస్తున్నారు. కార్యక్రమంలో జెఏసి సభ్యులు గూడూరు శివరామ ప్రసాద్, తోట రాజశేఖర్, రేవంత్, ధన, నరేంద్ర పాల్గొన్నారు.