Home బాపట్ల రైతుల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం

రైతుల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం

7
0

– అన్నదాత సుఖీభవ 2విడతల్లో రూ.6310 కోట్లు
– రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత వైసీపీ దే
– జగన్‌పై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజం
పర్చూరు (Parchuru) : ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలన కొనసాగించి ఒక్కరోజు కూడా పొలంలో అడుగుపెట్టని జగన్మోహనరెడ్డి (ys jaganmohanreddy) నేడు అన్నదాతల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పంగా ఉందని, జగన్ ప్రకటనలు చూసి రైతులు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను, రైతులను మరోసారి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడంటూ మాజీ సిఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసిపి పాలన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసిందని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు తమ పాలన వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు జగన్ అబద్ధాల అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహనరెడ్డికి లేదని దుయ్యబట్టారు. అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో రూ.6310 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.

ధాన్యం బకాయిలు రూ .1,674 కోట్లు చెల్లింపు
2023–24 రభీకి ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు వైసీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేస్తే కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఏలూరి గుర్తు చేశారు. వైసిపి హయాంలో రైతు ఆత్మహత్యల కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఆలస్యం లేకుండా మంజూరు చేసిందని వివరించారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 2లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా చెల్లించామని చెప్పారు. పంటల బీమా పేరుతో రైతులను నిరాశపరిచిన వైసిపి ప్రభుత్వం కనీసం ప్రీమియం కూడా చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు రాకుండా చేశారని విమర్శించారు.

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన రైతులకు రూ.50 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించామని వెల్లడించారు. పంట ధరలు పడిపోయినప్పుడు నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకుని గత 16 నెలల్లో రైతులకు రూ.800 కోట్లకుపైగా ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. పొగాకు రూ.271 కోట్లు, మామిడికి రూ.261 కోట్లు, ఉల్లి రూ.125 కోట్లు, కోకో రూ.14 కోట్లు, టమాటా రూ.12 కోట్లు ప్రభుత్వం ముందస్తుగా చెల్లించినట్లు చెప్పారు. ఉల్లి ధరలు క్వింటాకు రూ.1,200 కంటే తక్కువ వచ్చినప్పుడు వ్యత్యాస నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన తొలి ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. 1,20,754 క్వింటాళ్ల ఉల్లి సేకరించామని, నష్టపరిహారం రూ.25వేల నుంచి రూ.50వేలు అందిస్తున్నామని అన్నారు.