Home బాపట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి

10
0

బాపట్ల (DN5 News) : జిల్లా కేంద్రంలో ఈ నెల 8 నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.Vinod Kumar IAS) పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హల్ నందు డిఆర్ఓ, ఆర్‌డిఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డీఎ, మెప్మా, ఐసిడిఎస్ పిడిలు, వివిధ జిల్లా శాఖల అధికారులతో ఈ నెల 8న జిల్లా కేంద్రం తోపాటు నియోజకవర్గాల్లో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవంకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి 3వేల మంది మహిళలు పాల్గొనున్నారని తెలిపారు. అందుకు అవసరమైన లొకేషన్ చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లా కేంద్రం తోపాటు నియోజకవర్గాలలో 5 వందల మంది మహిళలతో నిర్వహించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి మినిట్స్ తయ్యారు చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. మెప్మా, డిఆర్డీఏ, ఐసిడిఎస్ పిడీలు మూడు వేల మంది మహిళలను సమీకరించాలని ఆదేశించారు. స్త్రీ శక్తి, మహిళ యాప్, మహిళ పోలీస్, డిడిఆర్డీఏ, మెప్మా, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డిఎం అండ్‌ హెచ్ఓను ఆదేశించారు.

డిఆర్డీఏ మెప్మా ద్వారా మెగా చెక్కును పంపిణీ చేయాలని పీడీలను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి పాల్గొనున్న కార్యక్రమం లైవ్ ఉంటుందని తెలిపారు. జిల్లా నుండి డ్వాక్రా సంఘాల సభ్యులు 6 వందల మంది మహిళలను (Womens Day) ముఖ్యమంత్రి పాల్గొనే సమావేశానికి పంపించుటకు 12 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌ను, డీఆర్డీఏ మెప్మా పీడీలను ఆదేశించారు. జిల్లాలోని ఎంపి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, జిల్లా నుండి కొంత మహిళలతో సిఎం మాట్లాడతారని, వారిని సిద్ధం చేయాలని ఐసిడిఎస్, డిఆర్డీఎ పీడీలను ఆదేశించారు. జిల్లా లోని చినగంజాం మండలంలో సముద్రం మొక్కల పెంపకం యూనిట్‌కు చెందిన మహిళ ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలను, బ్యాంకులు, లబ్ధిదారులను తీసుకురావాల జిఎండిసి, బ్యాంక్ అధికారులని ఆదేశించారు.

బ్యాంక్ లింకేజీలో టాప్ 3 ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్యాంకుల వద్ద పెండింగ్ ఉన్నవాటిని బ్యాంకు అధికారులతో మాట్లాడి పూర్తి చేయాలని ఎపిఎంలను ఆదేశించారు. స్త్రీ నిధి, ఉన్నతికి సంబంధించి రుణాలు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎల్‌డిఎంను ఆదేశించారు. మహిళ సంఘాలకు రుణాలు ఇప్పించడంలో చివరలో ఉన్న ఎపిఎంలకు సంబంధించి ఈ ఫైల్ పంపించాలని డిఆర్డీఏ, మెప్మా పీడీలను ఆదేశించారు. ప్రతి మండలం నుండి విజయగాధలు పంపించాలని డిఆర్డీఏ పిడిని ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు బ్యాంకు ఖాతాలను తప్పనిసరిగా వంద శాతం ఈకెవైసి చేయించాలని ట్రెజరీ అధికారిణి ఆదేశించారు.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి డిఆర్ఓ జి గంగధర్‌గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న, ఐసిడిఎస్, డిఆర్డీఎ, మెప్మా పిడీలు రాధమాదవి, సింగయ్య, ఆనందపాల్, డిఎం అండ్‌ హెచ్ఓ ఎస్ విజయమ్మ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, ఎపిపి, ఆర్టీసీ ఆర్ఎం విమల, జిల్లా రవాణా అధికారి పరందామరెడ్డి, పౌర సరఫరా శాఖ డిఎం శ్రీలక్ష్మి, డిసిహెచ్ఎస్ పద్మావతి, కలెక్టరేట్ ఎఒ మల్లిఖార్జునరావు, డిఎస్‌పిలు పాల్గొన్నారు.