Home ప్రకాశం నర్సులను గౌరవించడం మన బాధ్యత : తాడివలస దేవరాజు

నర్సులను గౌరవించడం మన బాధ్యత : తాడివలస దేవరాజు

261
0

– ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
– నర్సుల సేవలు ఎంతో విలువైనవి
– రోటరీ క్లబ్ ఎప్పుడు నర్సులకు అండగా ఉంటుంది
చీరాల : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు పని చేస్తున్న నర్సులను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ క్లబ్ క్షీరపురి ప్రెసిడెంట్ తాడివలస దేవరాజు అధ్యక్షతన, డాక్టర్స్ చేతుల మీదగా నర్సులకు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ కరోనా సమయంలో సొంత బంధువులు కూడా కరోనా సోకిన వారి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో నర్సులు ప్రాణాలకు తెగించి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. అటువంటి వారిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు నర్సులు అందిస్తున్న వైద్యసేవలను ఎంతో విలువైనదిగా గుర్తించాలని అన్నారు. వాళ్ళకి తగిన గౌరవాన్ని అందించాలని కోరారు.

డాక్టర్ చింతల జై హరీష్, డాక్టర్ మేడిశెట్టి సాయి కుమార్, డాక్టర్ తాడివలస కుమార్, తాడివలస సురేష్, పంబ నరేష్, తాడివలస దేవరాజు చేతుల మీదగా నర్సులను శాలువాతో సత్కరించి, స్వీట్ బాక్స్ లు అందించారు. కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.