Home బాపట్ల ప్రశాంత వాతావరణంలో ఇంటర్‌ పరీక్షలు : కలెక్టర్‌

ప్రశాంత వాతావరణంలో ఇంటర్‌ పరీక్షలు : కలెక్టర్‌

10
0

బాపట్ల (DN5 News) : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (IAS V VinodKumar)తెలిపారు. బాపట్ల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన ఆయన పరీక్షల తీరుతెన్నులు, గదుల వెలుపల భద్రత పరిశీలించారు. ఈ కేంద్రంలో 295 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా ఐదుగురు గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ బి తిలక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలన్నింటిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సాధారణ ఇంటర్మీడియట్ విద్యార్థులతోపాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా ఆయా పరీక్షా కేంద్రాలలోనే పరీక్షలు రాస్తున్నారని అన్నారు. ఆయన వెంట బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహశీల్దారు షాలీమా ఉన్నారు.