చీరాల (Chirala) : రాష్ట్రంలో బిసిలకు అన్యాయం జరుగుతుందని బిసి నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు ఆరోపించారు. రాష్ట్రంలో 60 శాతంకుపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం దక్కటం లేదని పేర్కొన్నారు. 5 శాతం కూడా లేని అగ్ర కులాల నుండి 90 శాతం పదవులు పొందుతున్నారని అన్నారు. దామాషా ప్రకారం బిసిలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ నెల 22న విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా జరిగిన సమావేశంలో ఊటుకూరు వెంకటేశ్వర్లు, గాదె హరిహరరావు, అనుభం వెంకటేశ్వర్లు, మునగపాటి నాగరాజు, బూదాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.






