Home ప్రకాశం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికే సంఘం పునరుద్ధరణ

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికే సంఘం పునరుద్ధరణ

236
0

చీరాల : ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిధిగా విచ్చేశారు. సభాధ్యక్షులుగా స్థానిక సీనియర్ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ చీరాల శాఖ అధ్యక్షులు మ్యూనిపల్లె వెంకట చలపతి రావు వ్యవహరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, భారత న్యాయవాదుల సంఘం ( ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ) 1989వ సంవత్సరంలో తొమ్మిది మంది ఘనాపాటీలైన న్యాయవాదులు ప్రారంభించారు. ఇది ఒక్క ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కె పరిమితం కాదు. దీనికి అనుబంధమైన సంఘం ఒకటుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ డెమోక్రాటిక్ ఆఫ్ లాయర్స్ కి అనుబంధమైనది. అనేక కారణాలవల్ల ఈ సంఘం కొంతకాలం ఉనికిని కోల్పోయింది. ప్రస్తుతం ఈసంఘాన్ని పునరుద్ధరించాము. న్యాయవాదుల సంఘం ఎన్నికలలో కూడా మద్యం, డబ్బు వంటి తాయిలాలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజానికి మార్గదర్శకంగా ఉండవలసిన మనమే అడ్డదారులు తొక్కడం వల్ల సమాజంలో విలువలు కోల్పోతున్నాము. ఈ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని చెప్పారు.

సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావుని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఒంగోలు జిల్లా కోర్ట్ సీనియర్ న్యాయవాది పోతిన వెంకటేశ్వర్లు, అరుణక్క, చీరాల కోర్ట్ బార్ రెప్రెసెంటేటివ్ మణి, ఐఏఎల్ చీరాల శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ రమేష్ బాబు, తారక తదితరులు పాల్గొన్నారు.