Home బాపట్ల సముద్ర మొక్కల పెంపకంతో ఆదాయం

సముద్ర మొక్కల పెంపకంతో ఆదాయం

7
0

చిన్నగంజాం (DN5 News) : సముద్రపు మొక్కలు పెంపకంలో మహిళల తలసరి ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ (Collector Dr.V.Vinod Kumar IAS) చెప్పారు. మండలంలోని పెద్దగంజాం ఏటిమొగ గ్రామంలో సముద్రం మొక్కల పెంపకం యూనిట్ ను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సముద్రంలో చేపట్టిన మొక్కల పెంపకం యూనిట్, సాగు విధానం పరిశీలించారు. మత్స్యకార మహిళలు పొందుతున్న ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యంత తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే సముద్ర మొక్కల పెంపకం, మార్కెటింగ్ విధానాలపై ఆరా తీశారు. ఎన్నో పోషక విలువలు, ఔషధాల కొరకు వినియోగించే సముద్ర మొక్కల పెంపకంతో మత్స్యకార మహిళల జీవితాలు మారిపోనున్నాయని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం సహకారం, సెర్ప్ ద్వారా యూనిట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. సహజ వనరులు సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. వరి పంట మాదిరిగానే సముద్రంపై ఈ పంట సాగు చేయడం సంతోషదాయకం అన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 45 రోజుల్లో మొక్క పెరుగుతుందని, వాటిని ఔషధాలకు వినియోగిస్తారని చెప్పారు. సముద్ర మొక్కల పెంపకంతో మహిళల ఆర్థిక వనరులు మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం సీఎంసిఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ తెలిపారు. ఈమొక్కలలో కరాజీనా అధికంగా ఉత్పత్తి అవుతున్నట్లు పరిశోధనల్లో తేలిందని అన్నారు.

ఒక యూనిట్ ప్రారంభించగా ప్రస్తుతం 50 టన్నులు ఉత్పత్తి వచ్చిందని అన్నారు. ఒక టన్ను ధర రూ.50 వేలు ఉన్నట్లు తెలిపారు. ఒక్క మహిళ 8 క్లస్టర్లు వేసుకోవడానికి అవకాశం ఉందని సూచించారు. 8 మీటర్ల చొప్పన 8 ప్లాస్టిక్ పైపులతో గడులుగా ఏర్పాటు చేసి ఒక్కో గడికి 12 మీటర్ల వెడల్పు చొప్పున వలలు, ట్యూబ్ నెట్ ద్వారా సముద్ర మొక్కలు సాగు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం 32 మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. బయట మార్కెట్లో ఈ మొక్కలకు ఎంతో డిమాండ్ ఉందని వివరించారు. ఆయన వెంట డిఆర్డిఏ పిడి బి సింగయ్య, చీరాల ఆర్డీఒ టి చంద్రశేఖర్ నాయుడు, తహశీల్దారు ప్రభాకరరావు, ఎంపిడిఒ, ఎపిఎం సుబ్బారావు ఉన్నారు.