Home ప్రకాశం జివిఆర్‌ హాస్పిటల్‌ ప్రారంభం

జివిఆర్‌ హాస్పిటల్‌ ప్రారంభం

70
0

చీరాల (Chirala) : పేద ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ పేరయ్యచౌదరి (Peraiah Choudari), డాక్టర్‌ గోరంట్ల సుబ్బారావు (Gorantla Subbarao) పేర్కొన్నారు. స్థానిక చర్చి రోడ్డు, మసీద్ సెంటర్ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన జివిఆర్ హాస్పిటల్ ప్రారంభ సభలో వారు మాట్లాడారు. సభలో డాక్టర్ ఐ బాబురావు (Dr.Baburao), డాక్టర్ కృష్ణచైతన్య (Dr.Krishna Chaitanya), డాక్టర్ శ్రావణి (Dr.Sravani), డాక్టర్ గోరంట్ల రాజేష్ (Dr.Gorantla Rajesh), డాక్టర్ నాగేశ్వరావు (Dr.Muddana Nageswarao), డాక్టర్ ఎస్‌ కొండలరావు (Dr.Sankarasetty Kondalarao) మాట్లాడారు. వైద్యశాల అధినేత డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్, వైద్య శాల ఎండి సాధన రతన్ వైద్యశాల్లోని వివిధ విభాగాల పనితీరును వివరించారు. ఆరోగ్య రక్షణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని డాక్టర్‌ గోరంట్ల సుబ్బారావు, డాక్టర్‌ వి అమృతపాణి (Dr.Varikuti Amrutapani) కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. జాలి, దయ కలిగి పేదలకు అతితక్కువ ఫీజులతో వైద్యం అందించాలని సూచించారు. రోగుల ఎడల ప్రేమ కలిగి ఉండాలని అన్నారు. హాస్పటల్ ఎండి పల్లె సాధన గ్రేస్, డాక్టర్ రతన్ ప్రదీప్ దంపతులు మాట్లాడుతూ పట్టణంలో కార్పోరేట్ వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అందరి సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు అమలు చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. వైద్యశాల్లో ఐసీయూ, సెమీ ఐసీయూ, అత్యాధునిక ఆపరేషన్ థియటర్స్, మెడికల్ స్టోర్స్, అత్యాధునిక ల్యాబ్, పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన నర్సింగ్ సిబ్బందితో 20పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.