
Illu illalu pillalu today episode 187 : ఇంట్లో గొడవలన్నిటికీ కారణం నువ్వే అంటూ నర్మదను తీవ్రంగా మందలించిన మామ గదిలోకి వెళ్లిపోతాడు. అత్త బుజ్జమ్మకు కూడా తెలియకుండా ప్రేమ డాన్స్ క్లాస్ చెబుతుందని తెలుసుకున్న అత్త మండిపడుతుంది. అత్తను కూల్ చేసేందుకు నర్మదా, ప్రేమ వంటగదిలోకి వెళ్తారు. ఇక ఈరోజు 187వ ఎపిసోడ్ లో ఏమైందంటే…
నర్మదా నిన్న రాత్రి జరిగింది తలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఓదార్చేందుకు సాగర్ వస్తాడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మామయ్య చెంప కొట్టిన బాధపడే డాన్ని కాదు. కానీ నా కారణంగా ప్రశాంతత లేదు అనడాన్ని తీసుకోలేకపోతున్నాను. ప్రేమ కష్టాన్ని చూసి డాన్స్ క్లాస్ చెప్పడానికి చూపించాను. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మాటలు అంటే ఎలా. మా నాన్న ఎదిరిస్తే సహించలేడు అంటాడు సాగర్. అందరిని వదిలేసుకుని వచ్చా ను. అత్త ఇళ్లయినా, పుట్టిళ్ళైన ఇదేనా నాకు. అలాంటిది ఎందుకు గొడవలు పెడతాను. నా కారణంగా ప్రశాంతత దూరమైందని ఎలా అనగలిగారు. అనగానే సాగర్ తనకు కూడా వాళ్ళ నన్న మాట్లాడిన మాటలపై కోపంగా ఉంది అంటాడు. నానన్ను అడగాలనిపిస్తుంది. మా నాన్నతో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అంటాడు. ఆ మాటలకూ బాధలో ఉన్న నర్మదాకు ఒకింత ధైర్యం వచ్చిన ఫీలింగ్ చూపిస్తూనే ఉన్న సమస్యలు చాలు కొత్త సమస్యలు వద్దు అంటూనే సంతృప్తి పడుతుంది.
రాత్రి ఇంట్లో జరిగింది తలుసుకుంటూ మామ మిల్లులో కూర్చుని ఆవేశపడుతుంటాడు. ఇంతలో ఎవరో బియ్యం బస్తాలు కావాలని ఫోన్ చేస్తారు. ఆ బస్టాలు పంపడానికి సాగర్ అప్పటికి మిల్లుకు రాకపోవడంతో బామ్మర్ది దగ్గరికి వెళ్తాడు. బామ్మర్ది ఫోన్లో పాటలు వింటూ ఉంటాడు. బియ్యం బస్తాలు పంపమని చెప్తుండగా గుమస్తా వచ్చి ఏమిటి అయ్యగారు చికాకుగా ఉన్నారు అంటాడు. రాత్రి జరిగిన కోడళ్ల విషయం మాట్లాడు తుండగా సాగర్ వస్తాడు. ఇంట్లో ప్రశాంతత కరువైందని మొదలుపెడతాడు. సాగర్ తన భార్య నర్మదాను రాత్రి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని తండ్రితో వాదన చేస్తాడు. దీంతో పెళ్ళాలు వచ్చాక కొడుకుల్ని మార్చేశారనే నిర్ణయానికి వస్తాడు.
ఊర్లో అత్తలందరూ కోడాళ్లని శాసిస్తుంటే నేను మాత్రం ఫ్రెండ్లీగా ఉంటున్నాను అంటుంది అత్త బుజ్జమ్మ. ఇలా అత్తా కోడలు మధ్య సంభాషణతో ఉండగా అత్తకు కూడా తెలియని విషయం, నాకు నర్మదాకే తెలిసిన విషయం మామయ్యకు ఎవరు చెప్పారంటూ ప్రేమ అనుమానిస్తుంది. వల్లినే మామకు చెప్పి గొడవలు పెట్టుంటుంది అనుకొని కోడలు ఇద్దరు వెళ్ళిపోతారు.
తోడు కోడలు ఇద్దరు కలిసి వల్లి దగ్గరకు వెళ్తారు. వల్లి ఆనందంతో పాటలు పడుకుంటుండగా చెరో వైపు కూర్చుని వల్లిని పొగుడుతూ అసలు విషయం అడిగేస్తారు. డాన్స్ క్లాస్ విషయం మామయ్యకు ఎవరు చెప్పారని ప్రశ్నిస్తారు. ఇంతటితో తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏమి జరిగిందనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.