Home బాపట్ల రూ.లక్షపైన విరాళం ఇచ్చిన దాతలకు గుర్తింపు కార్డులు పంపిణీ

రూ.లక్షపైన విరాళం ఇచ్చిన దాతలకు గుర్తింపు కార్డులు పంపిణీ

10
0

అద్దంకి (DN5 News) : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నిత్యం భక్తులతో విరాజిల్లుతుంది. గతేడాది దాతలు, టిటిడి దేవస్థానం ఆర్థిక సహకారంతో రాతి ముఖ మండప నిర్మాణం చేశారు. పాలక మండలి అధ్యక్షులు చుండూరి మురళి సుధాకరరావు, దేవస్థానం సహాయ కమిషనర్, ఇఒ మదమంచి తిమ్మనాయుడు ఆధ్వర్యంలో స్వామి వారి రాతి ముఖ మండప నిర్మాణానికి రూ.లక్షపైగా విరాళం ఇచ్చిన దాతలకు సోమవారం ఘనంగా సన్మానించారు. స్వామి వారి చిత్రపటాలు బహుకరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో దాతలకు ప్రత్యేక సౌకర్యాలు నేటి నుండి కల్పించునున్నట్లు తెలిపారు.

రూ.లక్ష పైగా నగదు అందజేసిన వారికి 6మంది కుటుంబ సభ్యులు ఉచిత అంతరాలయం దర్శనం, అర్చన జరిపించుకోవడం, పర్వదినం నందు దర్శనం మాత్రమే దాతలకు కల్పించనున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరంలో మూడు సార్లు అభిషేకంలో పాల్గొనటానికి వీలు ఉంటుందని అన్నారు. దాత గుర్తింపు కార్డులో పేరు నమోదు చేయబడిన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ సౌకర్యాలు వర్తిస్తాయని తెలిపారు. దేవస్థానానికి వచ్చే సమయంలో దాత గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో పాలక మండల సభ్యులు నూతి లక్ష్మీప్రసాద్, ఆకుల కోటేశ్వరమ్మ, ఏల్చూరి వెంకటనారాయణమ్మ, గొర్రెపాటి పద్మజ, అరబోలు నాగమ్మ, దేవరపల్లి సురేష్ బాబు, ప్రధాన అర్చకులు కోటా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.