Home క్రైమ్ భార్యను గొంతు నులిమి… కటకటాల పాలైన భర్త

భార్యను గొంతు నులిమి… కటకటాల పాలైన భర్త

7
0

అద్దంకి (DN5 News) : ఈనెల 16న తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కేసులో భర్తే హత్య చేసినట్లు విఆర్‌ఒ ఎదుట స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ముద్దాయి ఈర్ల బాలకోటేశ్వరరావు 16ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహమైనట్లు తెలిపారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం ఉన్నారు. కొంత కాలం తరువాత తన భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను హింసించేవాడు.

ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకుని ఈనెల 16న మద్యాహ్నం 12గంటల సమయంలో తను అద్దెకు ఉంటున్న 2వ అంతస్తు ఇంటిలో పిల్లలు లేని సమయంలో తన భార్యతో గొడవ పెట్టుకొని బెడ్‌రూమ్‌లో మంచంపై పడుకుని ఉన్న తన భార్యను రెండు చేతులతో గొంతు గట్టిగా పిసికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం తన కుమారుడు స్కూల్ వద్ద ఉండగా అక్కడకు వెళ్లి పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపొయాడు.

విఆర్‌ఒ షైక్ మహాబూబ్ బాష వద్ద సోమవారం హాజరై తన భార్యను తానే హత్య చేసినట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో విఆర్‌ఒ అతనిని స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద హాజరు పర్చారు. సిఐ అతనిని విచారించగా నేరం చేసినట్లుగా ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. కోర్టులో న్యాయమూర్తి అతనికి ఏప్రిల్‌ 6వరకు రిమాండు విధించారు.