Home విద్య అన్నీ… మానవ తప్పిదాలే….

అన్నీ… మానవ తప్పిదాలే….

575
0

చీరాల : వాతావరణంలో వచ్చే మార్పులకు మానవ తప్పిదాలే కారణమని తాడేపల్లి డాక్టర్ వైఎస్సార్ హార్టీ కల్చర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బరామమ్మ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం అంశంపై బుధవారం జరిగిన సదస్సులో మాట్లాడారు. మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో వచ్చే మార్పులతో ఋతువుల క్రమం మారోపోతుందన్నారు. దీని ప్రభావం వ్యవసాయంపై పడుతుందన్నారు. అడునులో నాట్లుపడక దిగుబడి తగ్గుతుందన్నారు.

సభాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ భుమిలోని శిలాజ ఇంధన వాడకం, చెట్ల నరికివేతతో భూమి వాతావరణం వేడెక్కిందన్నారు. దీని ప్రభావం వ్యవసాయంపై పడిందన్నారు. ఫలితంగా వ్యవసాయ దిగుబడి పడిపోతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరు చెట్ల నరికివేతను నివారించాలన్నారు. మొక్కలు పెంచి పర్యావరణం కాపాదలన్నారు.

సదస్సులో వృక్షశాస్త్ర అధిపతి యార్లగడ్డ సుబ్బారాయుడు, అధ్యాపకులు ఎ శ్రీనివాసరావు, డాక్టర్ జె అనురాధ, వై రంగనాయకులు, టి పొలయ్య పాల్గొన్నారు. సభలో సుబ్బరావమ్మను ఘనంగా సన్మానించారు.