బాపట్ల : హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా బాపట్ల జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కట్టా అశోక్ కుమార్‌ను నియమిస్తూ జాతీయ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మాదాసి చారేందర్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులైన గోగులపాటి రాంబాబు చేతుల మీదుగా కట్టా అశోక్ అశోక్ కుమార్‌కు నియామక పత్రం, ఐడీ కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ రెండేళ్లు బాపట్ల జిల్లాలో మానవ హక్కులను కాపాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడి వారికి న్యాయం జరిగేలాగా పోరాడాలని సూచించారు.