విజయవాడ : ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డితో సంబందం ఉందని పవన్ కళ్యాణ ఏ ఆధారంతో మాట్లాడారని పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తి మీద మీరు ఏ విదంగా ఆరోపణలు చేస్తారు అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పాతిమా కాలేజ్ విద్యార్థుల గురించి ఏమి తెలుస అని, ఆ కాలేజి యాజమాన్యం మీద మాట్లాడకుండా ప్రభుత్వం మీద ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుందని, దాని మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే దానిపై మీరు ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు.
2013 నివేదిక ఆధారంగా నేషనల్ కౌన్సిల్ అవినీతిలో ఆంద్రప్రదేశ్ ముందు ఉన్నదని చెప్పిన విషయాన్ని తెలుసుకోకుండా నోటికెలా వస్తే అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఎపికి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దక్షిణాదిలో సీనియర్, మచ్చలేని నాయకులు చంద్రబాబు నాయుడు అని బిజెపి వాళ్లకు తెలుసని అన్నారు. చంద్రబాబు నాయుడుని నైతికంగా దెబ్బతీయాలని వైసీపీ, బిజెపి ప్రయత్నం చేస్తే మీరు కూడా వాళ్ల ట్రాప్‌లో పడ్డారాని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తహశీల్దారు వనజాక్షి ఎంఎల్ఎ చింతమనేని ప్రభాకర్ ఇద్దరు మాట్లాడుకుని రాజీపడి వదిలివేసిన విషయాన్ని ఇప్పడు మళ్లీ ప్రస్తావించడం అవసరమాని ప్రశ్నించారు. పవన్ మాట్లాడిన ఏ ఒక్క విషయానికైనా క్రెడిబులిటి ఉందాని ప్రశ్నించారు. బస్సులో ఉండి రాష్ట్ర పరిపాలన చేసిన విషయం మీకు తెలియదాని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కడ ఉందో ఆధారాలతో చూపించిండని కోరారు. మీరు అడిగిన ప్రతి విషయం మీద వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నిరాదరమైన ఆరోపణలు చేయవద్దని కోరారు.