చీరాల : ఇళ్ళ స్థలాలకు ఎంపికైన లబ్దిదారులతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దేశాయిపేటలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్24 అనగా శనివారం అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చేతులమీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా శంకుస్థాపనా చేయనున్న స్వామి వివేకానంద కాలనకి సంబంధించిన నమూనాను లబ్ధిదారులకు చూయించారు.
రూ.75వేలు కట్టిన వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ భూమి మీద సర్వ హక్కులు లబ్దిదారునివే అన్నారు. విడతలుగా కట్టిన వారికి రిజిస్ట్రేషన్ ఉండదని, తరతరాలు ఆ భూమి మీద హక్కులు ఆబీకుటుంబీకులకు ఉంతాయని చెప్పారు. మొత్తం 1100 మందికి స్థలాలు మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ 1100మందిలో 250 మందికి ప్రభుత్వ భూమి ఉందన్నారు. వీరికి మాత్రమే ఉచితంగా ఇవ్వగలమని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజులుళ్ల చైర్పర్సన్ మొదడుగు రమేష్ బాబు కౌన్సెలర్లు సత్యనారాయణ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.