వేటపాలెం : మండలంలోని రామన్నపేట పంచాయితీ సాయినగర్‌లో అత్యంత వైభవంగా హోరైజన్ పబ్లిక్ స్కూల్‌ను శాసన సభ్యులు మద్దులూరి మాల కొండయ్య, రిటైర్డ్ ఐపిఎస్, సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, జాండ్రపేట ఇస్కాన్ మందిర్ వ్యవస్థాపకులు కె శివ శంకరరావు, సులోచన, తెలుగు దేశం నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంధ్రనాద్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, పాఠశాల సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పొగడదండ రవికుమార్ మాట్లాడుతూ అత్యుత్తమ విద్య అందించేందుకు హోరైజన్ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేటపాలెం కొత్త కాలువ ఆర్ అండ్ బి రహదారిలోని బ్రిడ్జి ప్రక్కన వినాయక స్వామి గుడి ఎదురుగా సాయినగర్ నందు ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన మామిడి తోటల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా నూతనంగా నిర్మించిన తరగతి గదులతో పలువురు డాక్టరేట్లు పొందిన ప్రొఫెసర్ల పర్యవేక్షణలో అత్యున్నత విద్యాబోధన చేయనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవంలో స్కూల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి హరిణి, మేనేజింగ్ డైరెక్టర్ పి హర్షి పాల్గొన్నారు.