Home బాపట్ల శాస్త్రవేత్త మురళీ వరప్రసాద్‌కు సన్మానం

శాస్త్రవేత్త మురళీ వరప్రసాద్‌కు సన్మానం

14
0

చీరాల (Chirala) : మండలంలోని దేవాంగపురి (Devangapuri) పంచాయతీలోని గంగా బ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో బట్ట మోహనరావు, పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బట్ట మోహనరావు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంతో (APJ Abdul Kalam) కలిసి అంతరిక్ష పరిశోధనల్లో కీలకంగా పనిచేసిన ఈపురుపాలెం వాస్తవ్యులు శాస్త్రవేత్త డాక్టర్ అందే మురళీ వరప్రసాద్‌ను సత్కరించడం గర్వకారణమని అన్నారు. డాక్టర్ మురళీ వరప్రసాద్ స్థాపించిన ట్రస్ట్ ద్వారా అనేక మంది యువకులకు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉగాది పురస్కార్ అవార్డు గ్రహీత వడలి రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు బండారు రాజేష్, గుత్తి పరంజ్యోతి, సీతారామయ్య, రోహిణి కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.