Home ప్రకాశం హోలివుడ్ షూ స్టైల్స్ షోరూమ్ ను ప్రారంభించిన చింతల

హోలివుడ్ షూ స్టైల్స్ షోరూమ్ ను ప్రారంభించిన చింతల

235
0

ఒంగోలు (దమ్ము) : మంగమూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హోలివుడ్ షూ స్టైల్స్ షోరూమ్ ను చింతల గ్రానైట్ అధినేత చింతల వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షోరూంలోని దేవుని చిత్రపటాల వద్ద దీపారాధన దివ్వెలను వెలిగించారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ దేశ, విదేశీ బ్రాన్డెడ్ కంపెనీల మోడల్స్ షోరూమ్ లో అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయన్నారు. జిల్లాలోని ప్రజలు షాపుకి విచ్చేసి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. షోరూం దినదినాభివృద్ది చెంది ఇటువంటి షోరూమ్ శాఖలు మరిన్ని ఏర్పాటు చేసుకునేలా మీ సేవలు ప్రజలకు అందివ్వాలన్నారు. హోలివుడ్ షూ స్టైల్స్ షోరూమ్ జిల్లాలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. తద్వారా షాపు యజమాని ఆర్థికంగా సంతోషకరంగా ఉండాలని ఆశీర్వదించారు. షాపు యజమాని నుండి మొదటి వ్యక్తిగా షూ కొనుగోలు చేసి విక్రయాలు ప్రారంభించారు.