బాపట్ల : రోజుటి లాగా విధులకు బైకుపై వెళుతూ ఎ శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. చీరాల మండలం గవినివారిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో హెచ్ఎంగా పని చేస్తున్న అంగిరేకుల శ్రీనివాసరరావు రోజు లాగా మంగళవారం ఉదయం తన ఇంటి నుండి బైకుపై పాఠశాలకు వెళుతుండగా కేబుల్ వైరు మెడకు తగలడంతో బైక్ మీద నుంచి కిందపడి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం మృతికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాశాఖలో గత కొన్నేళ్లుగా పిల్లలకు విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు. విధిరాత వల్ల రోడ్డు ప్రమాదంలో హెచ్ఎం మరణించడం బాధాకరమని అన్నారు.






