చీరాల : సినీహీరో ఆదివారం చీరాల పట్టణంలో సందడి చేశారు. యాదవ యువత ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవానికి హాజరయ్యారు. తొలుత పాతచీరాల నుండి కీర్తివారిపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పారిశ్రామికవేత్త ఎంఎం కొండయ్యయాదవ్‌తో కలిసి సినీ హీరో నిఖిల్ సిద్దార్ద యాదవ్ యువతను ఉత్సాహపర్చారు.
వనమహోత్సవ సభలో ఎంఎం కొండయ్య యాదవ్ మాట్లాడుతూ 2019లో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా యాదవులంతా ఐక్యంగా ఉండి గెలిపించాలని కోరారు. యాదవ విద్యార్థులు చదువుల్లో ముందంజలో ఉండాలని కోరారు. అప్పుడే యాదవ సామాజికవర్గం ఉన్నత స్థానాలకు రాగలమని చెప్పారు.
సినీ హీరో నిఖిల్ సిద్దార్థ యాదవ్ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో యాదవ వన భోజనాలకు హాజరవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలతోపాటు ఆర్థికంగా యాదవులు ముందుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి గవిని శ్రీనివాసరావు, కర్నేటి ప్రసాదు, న్యాయవాది కర్నేటి రవి, ఎస్సై సుబ్బారావు పాల్గొన్నారు.