హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి ఉదారత చాటుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహిస్తికి చెందిన బాలిక బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ బాలికకు అండగా నిలిచారు. హైదరాబాద్ బసవతారకం ఆసత్రిలో ఆమెకు ఉచితంగా చికిత్స చేయించారు. ప్రస్తుతం బాలిక కోలుకున్నారు. తమకు అండగా నిలిచిన బాలకృష్ణకు బాలిక
కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘సెప్టెంబర్ 9న బాలిక ఆస్పత్రికి వచ్చారు. చాలా సీరియస్ కండీషన్లో ఉన్నారు. మా వైద్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆమెకు చికిత్స చేయమని వైద్యులకు చెప్పా. ఆ తర్వాత బాలికకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. కరోనాకు కూడా చికిత్స చేయించాం. ఆ తర్వాత బాలికకు ఆపరేషన్ చేశారు.’’ అని అన్నారు.