Home ప్రకాశం సంతోషమే సగం బలం – మనోనిబ్బరమే మరింత బలం

సంతోషమే సగం బలం – మనోనిబ్బరమే మరింత బలం

261
0

టంగుటూరు : కర్ఫ్యూతో ఇబ్బందులు పడుతున్న సింగరాయకొండ నుండి ఒంగోలు వరకు జాతీయ రహదారి కిరువైపుల ఉన్న ఎవరూ లేని నిరాశ్రయులు, యాచకుల ఆకలి కొంతైనా తీర్చాలనే ఉద్దేశ్యంతో వారికి పుల్కా ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ను యూత్‌ హెల్పింగ్‌ ఆర్గనైజేషన్ ద్వారా పంపిణీ చేశారు. యూత్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా అందరికి సుపరిచితుడైన షేక్‌ మస్తాన్ అనాదల ఆకలి బాధలను గుర్తించి నేను సైతం మీకోసం అంటూ ముందుకు వచ్చి ఆకలి తీర్చలనే ఉద్దేశ్యంతో జాతీయ రహదారి కిరువైపుల ఉన్న వారికి పుష్క ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు.

ఈ సందర్బంగా టంగుటూరు మస్తానయ్య ప్లెక్స్ ప్రేమ్ వర్క్స్ ఓనర్ షేక్‌ మస్తాన్‌ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ చేయూత నందించినందుకు ఆర్గనైజేషన్ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదే అవకాశం ఉన్నవాళ్లు ఇటువంటి కార్యక్రమాల ద్వారా నిరుపేదల అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ఆసక్తి ఉన్న దాతలు 8374392941 నంబరులో సంప్రదించాలని కోరారు. యూత్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు దేవరపల్లి చంద్రశేఖర్, కురుగుంట్ల ప్రవీణ్, చల్లపల్లి సుబ్బారావు, చాట్రగడ్డ శ్యామ్, కొమ్ము ప్రతాప్, గద్దల సురేష్, బక్కా సాగర్, కొమ్ము చిన్నబాబు పాల్గొన్నారు.