చీరాల (DN5 News) : పట్టణంలోని గొల్లపాలెం సచివాలయానికి సమీపంలో కుందేరు వెంబడి తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని నివసిస్తున్న నక్కల కులస్తుల కుటుంబాలకు చెందిన ఏడు కుటుంబాలు గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయాయి. సమాచారం అందుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి అత్యవసర సహాయ చర్యలు చేపట్టిందని, బాధిత కుటుంబాలకు అవసరమైన 40రకాల వంట సామాగ్రి, టార్పాలిన్ పట్టా, పెద్ద సైజు దుప్పట రెడ్‌క్రాస్ చైర్మన్ బూదరాజు శశి కిరణ్ అందజేశారు. విపత్తుల్లో నష్టపోయే బాధితులను ఆదుకునేందుకు రెడ్‌క్రాస్ ఎప్పుడూ ముందు ఉంటుందని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థకు, డిబిఆర్‌సి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి జిఎవి ప్రసాద్, యూత్ రెడ్ క్రాస్ జిల్లా కో ఆర్డినేటర్ మన్నారాయణ, డిబిఆర్‌సి ఏరియా కో ఆర్డినేటర్ వి భగవాన్ దాస్ పాల్గొన్నారు.






