చీరాల (DN5 News) : రోటరీ క్లబ్ ప్రెసిడెంటు జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో రూ.11వేల విలువైన 2 దహన యంత్రాలు (INCINERATORS) వాడరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అందజేశారు. బాలికల సౌకర్యార్థం పరిశుభ్రత, ఆరోగ్యం కొరకు హెడ్ మాస్టర్ రత్నకుమారి, టీచర్ దండా నారాయణరావు రోటరీ క్లబ్ ప్రతినిధులను అడిగిన అనంతరం బాలికల మరుగుదొడ్లలో బిగించి, జాగ్రత్తగా ఉపయోగించు కోవాలని సూచన చేశారు. ఈ సందర్భంగా రోటరీ ప్రెసిడెంట్ కృష్ణమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, డాక్టర్ ఐ బాబూరావు, జివై ప్రసాద్, బాల వెంకటేశ్వరరావు, శివాంజనేయ ప్రసాద్, గుద్దంటి రమేష్, ఇంచార్జీ హెడ్ మాస్టర్ జి భాస్కరరావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ప్రాధమిక పాఠశాల హెడ్ మాస్టర్ ఆర్ రామాంజనీ దేవి, బాల, బాలికలు పాల్గొన్నారు.






