Home ఆంధ్రప్రదేశ్ ఆధునిక చేనేత పరికరాల పంపిణీ : దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర

ఆధునిక చేనేత పరికరాల పంపిణీ : దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర

359
0

వేటపాలెం : చేనేత సహకార సంఘం కార్యాలయంలో హర్తాకర సంవర్ధన్ సహాయత పధకం ద్వారా పందిళ్లపల్లి, రామన్నపేట, దేశాయిపేట గ్రామాలకు చెందిన 80మంది చేనేతలకు నూతన టెక్నాలజీ జోడించిన మోటార్ తో నడిచే రాట్నం, ఆధునిక పరికరాలు, జాకార్డు మిషన్ లను దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, హ్యాండ్లూమ్ ఎడి ఉదయ్ కుమార్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీరక సురేంద్ర మాట్లాడుతూ 10శాతం లబ్ధిదారుల వాటా 90శాతం సబ్సిడీతో ఆధునికతను పెంపొందిచటానికి ఈ పధకం ద్వారా ప్రభుత్వం చేనేతలకు చేయూత ఇవ్వటం చాలా మంచి పరిణామం అన్నారు. హ్యాండ్లూమ్ ఎడి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చేనేతలకు సహాయం చేయడానికి, పధకాల ద్వారా లబ్ది చేకూర్చడానికి తాము ఎప్పుడు అధికారులుగా సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో హ్యాండ్లూమ్ అధికారులు శర్మ, రాజవర్ధన్, బాపట్ల పార్లమెంట్ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బీరక సురేష్, దేవన గంగాధర్, యల్లమందేశ్వరరావు, శివరావు, పవన్ కుమార్, చేనేత నాయకులు పాల్గొన్నారు.