రేణిగుంట : గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి మంగళం, జీవకోన, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, గరుడ సర్కిల్, అలిపిరి టోల్ గేట్ వరకు వేలాదిమంది అభిమానులు, నగరప్రజలు, కార్యకర్తలు, నాయకులు పూలవర్షం కురిపించారు. అభిమానులకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ తిరుమల శ్రీ పద్మావతీ అధితిగృహంకు జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు.