Home ఆంధ్రప్రదేశ్ చీరాలలో దారుణం, గర్భవతికి చివరి నిమిషంలో చికిత్స నిరాకరించిన వైద్యులు

చీరాలలో దారుణం, గర్భవతికి చివరి నిమిషంలో చికిత్స నిరాకరించిన వైద్యులు

1077
0

ప్రకాశం జిల్లా : చీరాలలో దారుణం చోటుచేసుకుంది. చీరాల 100 పండకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పేరాలకు చెందిన కాగితల కిరన్మయి అనే మహిళ చికిత్సకు చేరింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతను వైద్యులు పరిశీలించారు. సాయత్రం 4గంటలకు ఆపరేషన్ చేస్తానని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్న శాంతి వైష్ణవి అనే గైనకాలజిస్ట్ డాక్టర్ చేప్పారని భాదితురాలి బంధువులు తెలిపారు.

సాయత్రం 7.30 నిమిషాలకీ ఆస్పత్రికి వచ్చిన గైనకాలజిస్ట్ శాంతి వైష్ణవి ఆస్పత్రిలో కరెంట్ లేదని, ఆపరేషన్ చేయలేమని, ఒంగోలు వెళ్లాలని చెప్పారని, ఇప్పటికిప్పుడు చేబితే ఎలా తీసుకు వేళ్ళలాని ఆందోళన చేపట్టారు. ఒంగోలు ఆస్పత్రికి చివరి నిమిషంలో వెళ్ళమని చెప్పడంతో ఆసుపత్రి వద్ద ఆమె భర్త కాగితాల రమేష్, బంధువులు ఆందోళనకు దిగారు. పేదవారమైన తాము ఆస్పత్రికి వస్తే ఆపరేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒంగోలు వెల్లమనడం ఏంటని వైద్యులను ప్రశ్నించారు. బాలింతకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత అని, తమకు చీరాల 100 పడకల ఆస్పత్రిలోనే ఆపరేషన్ చేయాలని భాదితులు హస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి హాస్పిటల్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.