Home ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు అండగా ఉంటా : మంత్రి బాలినేని

జర్నలిస్టులకు అండగా ఉంటా : మంత్రి బాలినేని

489
0

ప్రకాశం : జిల్లాలో ఉండే జర్నలిస్ట్ లకు ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎపియుడబ్యుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా యూనియన్ నాయకులు గురువారం మంత్రి బాలినేనిని కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి బాలినేని దృష్టికి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు తీసుకొనివెళ్లారు. ప్రధానంగా ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వలన జర్నలిస్ట్ కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయని అన్నారు. నిత్యం ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని వీరికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివెళ్లి చేయూత నందించాలని కోరారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా బారిన పడిన జర్నలిస్ట్ లకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇటీవల కోవిడ్ తో చనిపోయిన ఉషా కిరణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ఇటీవల మరణించిన కిరణ్ కుటుంబానికి తాను స్వయంగా రూ.25వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు.