పర్చూరు (Parchuru) : శనగ రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) కోరారు. పంట చేతికొచ్చిన వెంటనే సీఎం యాప్‌లో నమోదు చేసుకొని, షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. శనగలు మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులు ముందుగా సీఎం యాప్‌లో నమోదు చేయించుకోవాలని, ఇందుకోసం ఆర్‌ఎస్‌కే వద్ద అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులకు సౌలభ్యం కోసం నియోజకవర్గం వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పేర్లు నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తమ పంటను కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రద్దీ లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంటలు కనీస నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. తేమ శాతం నియమిత పరిమితిలో ఉండాలని అన్నారు. ప్రమాణాలు పాటిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుందని చెప్పారు. మార్కెట్‌లో ధరలు మార్పులకు గురైనా ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుందని అన్నారు. గతంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు.






