చీరాల : ప్రభుత్వ పథకాలు వినియోగించుకోటంలో నాయి బ్రాహ్మణులు చైతన్యవంతంగా వ్యవహరించాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం చీరాల రామాపురం అలా బీచ్ రిసార్ట్స్‌లో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ హైమా సుబ్బారావు మాట్లాడుతూ సంఘీయుల సమస్యల పట్ల చైతన్యంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు మల్కాపురం కనకారావు, అన్నవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమాల ద్వారానే రాష్ట్రంలోని ఆలయాల కేసుఖండన కార్మికుల జీతాలు పెరిగాయని తెలిపారు. నాయి బ్రాహ్మణులను చైతన్య పర్చటానికి ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మవాకి భాను ప్రసాద్, సహ అధ్యక్షులు ఎం బాలయ్య, గౌరవ అధ్యక్షులు పాత్తూరు గురుస్వామి, సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు కనుపర్తి జానకిరామ్, గౌరవ వృత్తిదారుల కన్వీనర్ రాయవరపు గణపతి, మల్లికార్జున, బన్నారావురి శ్రీనివాసరావు, కలవపూడి బసవేశ్వరరావు, చీరాల, పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు సత్యం, వెంకటస్వామి, శివ, సత్యనారాయణ, శంకర్, వెంకటేశ్వర్లు, భాను ప్రసాద్, హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు, మార్కాపురం వెంకట రామారావు, ఆర్ఎంపి రమేష్, శ్రీనివాస్, రామాంజనేయులు పాల్గొన్నారు.