చీరాల : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23నుండి 30వరకు జరుగు వైఎస్ఆర్ సిపి విజయోత్సవ కార్యక్రమాలను 23న మండల కేంద్రాలలో జెండా ఎగరవేసి వృద్ధులకు పళ్లు పంపిణీ చేసి ప్రారంభించనున్నారు.
చీరాల పట్టణంలొని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు, చీరాల మండలంలొని తోటవారిపాలెం పోలేరమ్మ గుడి వద్ద, వేటపాలెం మండలం నాగవరపమ్మ గుడివద్ద చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు, పట్టణ కన్వినర్లు సామాజిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 23నుంచి 30వరకు నిర్వహించే విజయోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశానికి చీరాల మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగోరి, మార్కెట్ వైస్ చైర్మన్ శవనం సుబ్బారెడ్డి, పట్టణ కన్వీనర్ యడం రవిశంకర్, చీరాల మండల కన్వీనర్ మేడిబోయిన బలరాంరెడ్డి, వేటపాలెం కన్వీనర్ కొలుకుల వెంకటేష్, ఆమంచి స్వాములు, చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్, మాజీ కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్నేటి రవి, కోటి దాసు, కోండ్రు కిరణ్, అందె కనకలింగేశ్వరరావు, కందుల విజయ్ కుమార్, ఊటుకూరి సుబ్బారావు, గలభా బాబు, ఎన్ఎస్ సాయి, గోలి వెంకట్రావు, గంజి వెంకటేశ్వర్లు, మండ సత్యనారాయణ, వి సుందరయ్య, గవిని వేణు, మునగపాటి బాబు, మిరియాల శ్రీనివాసరావు, బండ్ల బాబు, ఊటుకూరి శ్రీనివాసరావు, షేక్ సత్తార్, ప్రత్తి సుబ్బారావు పాల్గొన్నారు.