చీరాల : కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం వైకుంటాపురంలోని గౌడ సంక్షేమ కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు మాట్లాడారు. గౌడల్లో రాజకీయ చైతన్యం సన్నగిల్లిపోతున్న తరుణంలో గౌడ సంక్షేమ సంఘాన్ని జిల్లాలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంఘ బలోపేతానికి సూరగని లక్ష్మీకాంతారావు కృషి చేశారని అన్నారు. జిల్లాలో మిగతా కులాల ప్రతినిధులు ఇప్పుడు రాజకీమంగా, ఆర్థికంగా ఎదిగారన్నారు. తమ వెనుకబాటును పరిశీలించుకుని ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు. యువతకు కులంలోని పెద్దలు సూచనలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కీర్తి సాయి, ఉపాధ్యక్షుడు చుండూరు శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ భారతి పాల్గొన్నారు.