Home బాపట్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు

11
0

•మెగా పిటిఎం విద్యా విప్లవానికి శంఖారావం
•భావితరాలకు అద్భుత భవిష్యత్తుకు కృషి
•ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన
•దేశంలో ఎక్కడా లేనివిధంగా పిటిఎం
•విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరుకు నిదర్శనం
•పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి
•విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్ల ఏర్పాటు
•వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్ ఏర్పాటు
•ప్రహరీ గోడలు నిర్మాణానికి చర్యలు
•మార్టూరు జెడ్‌పిహై స్కూల్లో ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు (Marturu) : భావితరాల బంగారు భవిష్యత్తుకు సిఎం చంద్రబాబు (CM Chandra babu Naidu) నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుత అవకాశాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluru Sambashivarao) పేర్కొన్నారు. స్థానిక జెడ్‌పి హైస్కూల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతోనే విద్యా రంగం అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మే దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో విద్యా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలను ఒకే వేదికపై ఆత్మీయంగా కలిపే ‘పాఠశాల పండుగ’ కార్యక్రమం ‘టీచర్స్ మీటింగ్ (మెగా PTM)’ అన్నారు. విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తోందని అన్నారు. యువనేత నారా లోకేష్ (Minister Nara Lokesh) అద్భుత పనితీరుకు నిదర్శనం అన్నారు. తల్లిదండ్రులకు పాఠశాలను దగ్గర చేసి, విద్యార్థుల అభ్యాస ప్రయాణంలో సమిష్టి జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక బలమైన వేదికగా రూపొందిందని అన్నారు.

కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు కొత్త వెలుగు
గత ప్రభుత్వం నిర్లక్ష్య విధానాల వల్ల బలహీనపడిన విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మొదటి మెట్టుగా పాఠశాలను తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తామున్నాం అనే నినాదంతో, తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ, ఈ పండుగ మరపురాని అనుభవంగా మార్చడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

బడులను ముంచిన జగన్ మామ
గత ఐదేళ్లలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు జగన్‌ (YS Jagan mohan Reddy)ప్రభుత్వం దూరం చేసిందని అన్నారు. అసమర్థ విధానాలతో సాగిన వైసీపీ పాలన విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. పేదరికం కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమందికీ రూ.13వేల చొప్పున 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 10వేల కోట్లు తాము జమచేసినట్లు చెప్పారు. మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి యువ ఉపాధ్యాయులతో విద్యాశాఖను బలోపేతం చేశామన్నారు. అవినీతికీ, రాజకీయ నాయకుల ప్రమేయానికీ తావులేకుండా 68వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టామని, 4,477 మందికి పదోన్నతులు కల్పించినట్లు చెప్పారు. డొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు పోషక విలువలు, రుచీ శుచీ కలిగిన ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ – 2047 లక్ష్యంగా విద్యా రంగాన్ని ఆధునీకరిస్తూ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

తనిఖీ చేస్తూ… విద్యార్థులతో మమేకమవుతూ
ఉదయం 10 గంటలకు పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాఠశాల ఆవరణ కలియతిరిగారు. సౌకర్యాలు పరిశీలించారు. మరుగుదొడ్లు, ఆర్‌ఒ ప్లాంట్ తక్షణమే అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందరికీ సరిపడేలా డైనింగ్ హాలు నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వసతులు, విద్యా విధానం, ర్యాంకింగ్ తదితరు అంశాలపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థుల స్వాగత గీతం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి తన చిన్ననాటి గురువు నంబెల్ కుమార్‌ను పూల మాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రూత్ మేరీ జాయ్, ఎంఈఒ వస్రంనాయక్, తహశీల్దారు ప్రశాంతి, ఎంపిడిఒ శ్రీనివాసరావు, టోల్గేట్ మేనేజర్ దీపా, ఎస్ఎంసి చైర్మన్ ఇమామ్ వలి, వైస్ చైర్మన్ ఏసుపాదం, ఆదినారాయణ, ఫారుక్ పాల్గొన్నారు.