చీరాల : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా చీరాల కు చెందిన గొడుగుల గంగరాజు నాలుగోసారి ఎంపికయ్యారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ అని ప్రకటించారు. నూతన కార్యవర్గం లో గొడుగుల గంగరాజు రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎన్టీఆర్ అభిమాని గా రాజకీయాల్లోకి వచ్చిన గంగరాజు ఇప్పటికీ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. పార్టీ మారిన టువంటి అతి కొద్దిమందిలో గంగరాజు ఒకరు. పార్టీ కోసం అంకితం భావంతో పనిచేసిన గంగరాజు పార్టీలో వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. 2007లో తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటినుండి వరుసగా నాలుగో సారి కూడా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ అభిమాని గా నెల్లూరు జిల్లా గడ్డి పాలెం లో రామదండు శిక్షణ పొందారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడిగా పని చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు శిష్యునిగా తెలుగు యువత లో పనిచేశారు. దగ్గుబాటి పార్టీ వీడి నప్పటికీ గంగరాజు మాత్రం పార్టీని వీడలేదు. పార్టీ కోసం అంకితభావంతో పని చేశారు. నెల్లూరు జిల్లా పరిశీలకునిగా సేవలందించారు. గత ప్రభుత్వంలో హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల కోసం చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నాయకత్వంలో పని చేయడమేనని పేర్కొన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని అన్నారు. తను నాలుగో తప్ప కూడా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా ఎంపిక చేసిన పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపై చంద్రబాబు ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.