గుంటూరు : మాజీ లోక్‌సభ స్పీకర్, టిడిపి సీనియర్ నాయకులు జిఎంసి బాలయోగి 16వ వర్ధంతి సభను టిడిపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా బాలయోగి చిత్రపటానికి పర్యాటక శాఖ ఛైర్మన్ జయరామిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా జయరామిరెడ్డి మాట్లాడుతూ దళితుల అభివృద్దికి బాలయోగి చేస్తున్న కృషిని గుర్తించిన చంద్రబాబు అప్పట్లోనే లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగిని చేశారని పేర్కొన్నారు. లోక్‌సభలో స్పీకర్‌గా ఉన్న బాలయోగి ఆటుపోట్లను ఎదుర్కొనడమే కాకుండా విదేశాల్లో సైతం స్పీకర్ వ్యవస్థపై అధ్యయనం చేసి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు.
లోక్‌సభ సమావేశాలు తనదైన శైలిలో్ హుందాగా నిర్వహించి స్పీకర్ పదవికే వన్నెతెచ్చారని పేర్కొన్నారు. బాలయోగి స్పూర్తితో దళితుల అభివృద్దికి కృషి చేయాలని చెప్పారు. బాలయోగి భౌతిమకంగా మనమద్య దూరమైనప్పటికీ ఆయన చూపిన మార్గం ఉందన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా బాలయోగి నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యాలయ నిర్వాహకులు ఎవి రమణ, టిడిపి మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రబాబు, నాయకులు షేక్ లాల్‌వజీర్, వట్టికూటి హర్ష, తెలుగు యువత నాయకులు అబ్బూరి మల్లి, అశోక్‌యాదవ్, గోళ్ల ప్రభాకర్, తెలుగు విద్యార్ధి నాయకులు సాకిరి చైతన్య, తెలుగు మహిళా నాయకురాలు ములకా సత్యవాణి, పోతురాజు ఉమాదేవి, వేగుంట రాణి, పానకాల వెంకట మహాలక్ష్మి, బొబ్బిలి రామారావు పాల్గొన్నారు.