Home గుంటూరు తడి, పొడిచెత్త సేకరణపై సిబ్బందికి సూచనలు

తడి, పొడిచెత్త సేకరణపై సిబ్బందికి సూచనలు

387
0

పొన్నూరు : పొన్నూరు మున్సిపాలిటీలో పారిశుద్యం పెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు అవసరమైన డస్ట్‌ బిన్‌లను ప్రజలకు పంపిణీ చేశారు. ఇకనుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు అవసరమైన సూచనలను మున్సిపల్‌ కమిషనర్‌ పాయసం వెంకటేశ్వరరావు సిబ్బందికి సూచించారు. తడి చెత్త ద్వారా వర్మి కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తలో రీ సైక్లింగ్‌కు అనువైన వాటిని వేరుచేసి విక్రయించడం ద్వారా పురపాలక సంఘానికి ఆదాయం రావడంతోపాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇలాంటి నూతన పారిశుద్య విధానాలను సిబ్బంది అమలు చేయాలని చెప్పారు.