– అర్హులైనా వారికి పింఛన్లు అందటం లేదు
– గ్రామాల్లో పేదల గోడు వినేవారే లేరు
– ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలైలా చేస్తా
– కొమ్మునురు, ఎగ్గేనపల్లెల్లో రావాలి జగన్ కావాలి జగన్
గిద్దలూరు : అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇంచార్జీ ఐవి రెడ్డి ఆరోపించారు. కొమ్మునూరు, ఎగ్గెనపల్లెల్లో రావాలి జగన్ కావలి జగన్ నినాదంతో గడప గడప కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పింఛన్లకు అర్హత ఉన్నాకూడా మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి కులం, మతం చూడలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేశారని గుర్తచేశారు. పేదలకు గృహాలు మంజూరు చేయడంలో అధికార పార్టీ నేతలకు వివక్ష పనికిరాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికీ అందడం లేదని పేర్కొన్నారు. పసుపు రంగులో ఉన్నవారికే అందుతున్నాయన్నారు. పేదల గోడు పట్టించుకొనే పరిస్థితుల్లో టిడిపి నేతలకు లేదన్నారు. అధికార పార్టీ నేతల స్వలాభం కోసం అభివృద్ధి అనే పదానికి మాయని మచ్చ తెచ్చారని ఆరోపించారు. పేదల కోపానికి గురి కావోద్దని హెచ్చరించారు. వర్షాలు పడక గ్రామాలు గొంతెండుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అంటే వరుణ దేవుడు మోహం చాటేస్తాడన్నారు. అయన పరిపాలనలో కరువు కాటకాలతో ప్రజలు అలాడుతున్నరాన్నారని ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, జగనన్నతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. జగనన్న తీసుకు వచ్చే నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. వైఎస్సార్ ఆసరా పధకం కింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు.
అలాగే వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. 25 లక్ష్యల ఇళ్ళను కట్టించే బాద్యత జగన్ మోహన్ రెడ్డి తిస్కోబోతున్నారన్నారు. ప్రతి అవ్వకు, తాతకు రూ.2000వేలు పెంచన్లు ఇస్తామన్నారు. 45 సంవత్సరాలు నిండిన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.75వేలు దశలవారీగా ఆయా కార్పొరషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామన్నారు. పేదింటి పిల్లలు చదువులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ.15వేలు ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైన ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందింస్తామన్నారు. రైతు బరోసా పధకం కింద ప్రతి సంవత్సరం జూన్ నెలలో రూ.12500 ఇస్తామన్నారు. ప్రతి రైతుకు బోరు వేపించే బాద్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గిట్టుబాటు ధర కలిపించడం, ధర స్థిరికరణకు రూ.3000కోట్ల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే క్రాఫ్ లోన్ కింద వడ్డీలేని రుణం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే ఎవరు అదైర్యపడవద్దని బరోసా ఇచ్చారు. రాజన్న పాలన జగన్మోహన్ రెడ్డితో మళ్ళి చూస్తామని పేర్కొన్నారు. ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి వైయస్ఆర్ కాంగ్రెస్తోనే న్యాయం జరగుతుందన్నారు. కార్యక్రమంలో శీలం బాలఅంకీ రెడ్డి, బారెడ్డి రమణ రెడ్డి, పల్లా ప్రతాప్ రెడ్డి, కాశిరెడ్డి, వెంకటరామిరెడ్డి, మధార్ వలి, గోపాల్, ఖాజా సబ్బిర్, రహిం, అల్లా మాలిక్, సోబాబు, భాస్కర్, బడేమియ, నాగరాజు, పిరారెడ్డి, హిమాం సాహెబ్ పాల్గొన్నారు.