చీరాల (Chirala) : కొత్తపేట జడ్పీ హైస్కూల్లో బత్తల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ గురువారం అందజేశారు. సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బత్తుల బ్రహ్మరెడ్డి (Brahmareddy) చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థి దశకు 10వ తరగతి కీలకం అన్నారు. అందులో రాణించిన ప్రతి విద్యార్థి ఇంటర్ (Inter), డిగ్రీ (Degree) ఫలితాలు మెరుగైన ప్రతిభ కనపరస్తారని అన్నారు. నిరంతరం కష్టపడి చదివి పరీక్షల్లో ఆశించిన విజయం సాధించాలని అన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల కలలు నెరవేర్చే విధంగా పట్టుదలతో పరీక్షలకు సిద్దం కావాలని అన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, సుందర్రావు, ఎలమందరెడ్డి, నాగవీరభద్రచారి, హెచ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.