Home ప్రకాశం గీతా సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీలు

గీతా సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీలు

633
0

చీరాల : అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా గీత సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీలకు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పుల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ పోటీలలో 22 మంది పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలలో ప్రధమ ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో లక్ష్మీ లావణ్య, దుర్గాబావని, వసంత నిలిచినట్లు తెలిపారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అంబెడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పోటీలలో పాల్గొన్న అందరికి బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో కర్ర శ్రీకాంత్, మువ్వల వెంకటరమణ, విజయ్ కుమార్, బండారు హేమంత్ కుమార్ పాల్గొన్నారు.