Home ప్రకాశం దేవరాజుకు గాయత్రి ల్యాబ్ అధినేత జగదీష్ అభినందనలు

దేవరాజుకు గాయత్రి ల్యాబ్ అధినేత జగదీష్ అభినందనలు

275
0

– తాడివలస దేవరాజు బాధ్యతను పెంచిన అవార్డు
– దేవరాజును ఆదర్శంగా తీసుకోవాలి
చీరాల : ఢిల్లీలో యంగ్ అచీవర్ అవార్డు అందుకున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజును దేశంలోని వివిధ నగరాల్లో అత్యాధునిక పాథాలజీ ల్యాబ్ సెంటర్స్ కల్గిన గాయత్రి సిఆర్ఎల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జగదీష్ అభినందించారు.

జగదీష్ మాట్లాడుతూ తాడివలస దేవరాజు విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, సామాజిక వంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం వలన ఈ అవార్డుకి ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ అవార్డు ద్వారా దేవరాజుపై మరింత సామాజిక బాధ్యత పెరిగిందని అన్నారు.