చీరాల : మండలంలోని గవినివారిపాలెం గ్రామ పశువుల వైద్యులలో వైద్యులు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక అనేక జీవాలు మృతి చెందుతున్నాయని, పశువుల వైద్యున్ని నియమించాలని కోరుతు గ్రామస్తులు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు బుధవారం బాపట్లలో వినతి పత్రం అందజేశారు. తమ వైద్యాశాల వైద్యుడిని డెప్యుటేషన్‌పై వేరే చోటికి పంపడంతో తాము ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటివరకూ సుమారు వంద జీవాలు మృతి చెందాయని తెలిపారు. తమ గ్రామంలో సుమారు ముప్పై వేల జీవాలు అంటే గొర్రెలు, బర్రెలు తదితర పశువులు ఉన్నాయని, పశువుల వైద్యుడిని నియమించి తమ గ్రామ వైద్యశాలకు పరిమితం చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఎంపిపి గవిని శ్రీనివాసరావు, చేతి వృత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్ పి కొండయ్య, శరత్, జిఎంపిఎస్ నాయకులు ఉన్నారు.