Home ప్రకాశం అప్రమత్తంకాకుంటే అభివృద్ధిలో చీరాల వెనక్కే : తాడివలస దేవరాజు

అప్రమత్తంకాకుంటే అభివృద్ధిలో చీరాల వెనక్కే : తాడివలస దేవరాజు

276
0

– మహాత్ముడి స్ఫూర్తితో పోరాడదాం
– చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహాత్ముడికి ఘన నివాళులు
చీరాల : జిల్లా సాధన కోసం ప్రతిఒక్కరు అప్రమత్తమై పోరాడకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని, అభివృధిలో వెనుక బడతామని చీరాల జిల్లా సాధన జేఏసీ చైర్మన్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ మహాత్ముడి స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడి జిల్లా సాధిద్దామని అన్నారు. జిల్లా సాధనతో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పరిశ్రమలు వస్తాయన్నారు. విద్య, వైద్య రంగంలో ఈ ప్రాంతం పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఎంతో నష్టపోయామని తెలిపారు. ఇప్పటికైన అందరం ఒక్క తాటిపైకి వచ్చి పోరాడ కుంటే భవిష్యత్తు తరాలు క్షమించవన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండ ప్రభుత్వ పెద్దలను ఒప్పించే విధంగా పోరాడి జిల్లాను సాధిద్దామన్నారు. జిల్లాల విభజన ప్రక్రియ వేగవంతంగా జరుగు తుందని చీరాల జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాసా మురళి, నరేంద్ర, రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.