Home ప్రకాశం టంగుటూరులో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

టంగుటూరులో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

402
0

టంగుటూరులో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
టంగుటూరు : మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ, నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలకు సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, ఎఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, గ్రామ కార్యదర్శి జగదీష్ బాబు, ఏపీఓ నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు చిడిపోతు సుబ్బారావులు పూలమాలలు నివాళులు అర్పించారు.

మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, వైస్సార్సీపీ నాయకులు బొడ్డపాటి అరుణ, తేళ్ల డేవిడ్ రాజ్, అనంతవరం వైసీపీ నాయకులు ఉప్పలపాటి సుబ్బరాజు, వినోద్, దాసరి సుబ్బారావు, నాగరాజు, వీరనారాయణ, కిషోర్, స్టేట్, ప్రభుదాస్, అనిల్, క్రాంతి ట్యుటోరియల్ కరస్పాండెంట్ అలెగ్జాండర్, ఉపాధ్యాయులు తుల్లిబిల్లి అశోక్, శ్రీనివాస్ కుమార్, కమలం శ్రీను, జిల్లా చంద్ర శేఖర్, నబి, బీసీ కోటయ్య, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.