బాపట్ల (Bapatla) : ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ (Friends Youth Organaitation) తమ వంతు ఆర్థిక సహాయం అందజేసినట్లు ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి తెలిపారు. పట్టణంలోని వెంగళ విహార్‌కు చెందిన ఆనంద్ దంపతులకు నాలుగు రోజులు క్రితం జన్మించిన బాబు శ్వాసకోస సమస్యతో వైద్యశాల్లో మెరుగైన చికిత్స అందించడం కోసం రూ.8 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని గోపి చెప్పారు. తమ వంతు సహాయంగా రూ.5వేలు ఆర్థిక సాయం అందించామని అన్నారు. దయగల దాతలు స్పందించి తమ వంతు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కోశాధికారి జోగి సువర్ణరాజు, భీమా కోటేశ్వరరావు, యశం రాజా రమేష్, బొగ్గవరపు శివ, కరీం, శ్రీను పాల్గొన్నారు.






