చింతగుంపల్లె గ్రామ అభివృద్ధి కమిటీ సేవలు అభినందనీయం : కనకారావు

    300
    0

    – వైద్య శిబిరానికి విశేష స్పందన
    – వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను వినియోగించుకోండి
    చీరాల, చిన్నగంజాం : చింతగుంపల్లె గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు మాదిగ అన్నారు. ఆదివారం చిన్నగంజాం మండలం చింతగుంపల్లె గ్రామంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు సహకారంతో చింతగుంపల్లె గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన కనిపించింది. క్యాంపు ప్రారంభ సభలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు మాదిగ, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు మాట్లాడారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు నివసించే గ్రామంలో ఉచితంగా వైద్య సేవలు అందించి మందులను పంపిణీ చేయాలని చింతగుంపల్లె అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బెజ్జం విజయ్ కుమార్ కోరడంతో వెంటనే స్పందించిన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు వారి వైద్య బృందంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులను పంపిణి చేయాటం హర్షణీయం అన్నారు. ఈ నేపథ్యంలో చింతగుంపల్లె గ్రామ అభివృద్ధి కమిటీ చేస్తున్న సేవలను ఇతర గ్రామాల కూడా ఆదర్శంగా తీసుకొని వారి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

    శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ముక్కు గొంతు సమస్యలకు మొట్టమొదటి సారిగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయబడునని తెలియజేశారు. యాక్సిడెంట్ కేసులకు, ఎముకలు విరిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడునని తెలిపారు. వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి తమ హాస్పిటల్ లో ఉచిత ఓపితోపాటు, ఇతర పరీక్షలోను, ఆపరేషన్లలో యాభై శాతం రాయితీ ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చింతల జె హరీష్, హరికృష్ణ, సాంబయ్య వైద్య పరీక్షలను అందించారు.

    ఈ కార్యక్రమంలో చింత గుంపుల గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెజ్జం విజయ్ కుమార్, చెల్లా జీవన్ బాబు, సభ్యులు కరణం తాతయ్య, కందిమల్ల మహేష్, కుడితి సత్యం, కటుకూరి ప్రసాద్ బాబు, చేగూడి అంకారావు, పాలపర్తి శ్రీనివాసరావు, దేవరపాటి వెంకట్రావు, వీడ్డెంపూడి బాబురావు పాల్గొన్నారు.